రకుల్ తో బిజినెస్ కు సై అంటోన్న నిఖిల్ 

యంగ్ టాలెంటెడ్ నిఖిల్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అనే అనాలి. ఇక ఇప్పుడేమో నిఖిల్ సినిమాల్లో బిజీగా ఉంటూనే.. బిజినెస్ పై కూడా దృష్టిసారించడం విశేషం. బిజినెస్ విషయంలో బాలీవుడ్ హీరోలు ముందు వరసలో ఉంటారు అనడంలో సందేహం లేదు.  పలువురు బాలీవుడ్ హీరోలు సినిమాలు చేస్తూనే.. బిజినెస్ పనుల్లో కూడా బిజీగా ఉంటున్నారు. మరోవైపు హీరోల కంటే హీరోయిన్లు కూడా ఇలాంటి విషయాల్లో ముందు వరసలో ఉంటుండటం ఈ మధ్య అలవాటుగా మారింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ఎఫ్45 అనే పేరుతో ఇంటర్నేషనల్ జిమ్ ను స్థాపించింది. ఈ జిమ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ జిమ్ మంచి పాపులర్ కావడంతో. .. మిగతా స్టార్స్ కూడా ఈ తరహా వ్యాపార రంగంలోకి దిగాలని చూస్తున్నారు. అందుకేనేమో ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తన తరపున ఒక జిమ్ సెంటర్ ను ప్రారంభించారు.  నిఖిల్ ఎఫ్ 45 పేరుతో సికింద్రాబాద్ లోస్థాపించాడు.  ఇది రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్ 45 కు అనుబంధ సంస్థ.  త్వరలోనే మరో ఆరు జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు నిఖిల్. ఈ లెక్కన ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్ 45 జిమ్ అని పిలిచిన వారు ఇప్పటి నుంచి నిఖిల్ ఎఫ్ 45 అని కూడా పిలుస్తారేమో. దీంతో ఇప్పుడు నిఖిల్ తో పాటు మరికొంత మంది స్టార్స్ కూడా త్వరలోనే ఇలాంటి వ్యాపార రంగంలోకి దిగాలని అనుకుంటున్నట్టు సమాచారం.