గోవాలో ప్రేమ.. అక్కడే నిశ్చితార్థం

యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఏప్రిల్ 16న ఆయన వివాహం డాక్టర్ పల్లవి వర్మతో జరగబోతోంది. ఫిబ్రవరి 1న గోవాలో ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఎప్పట్నుంచో ఈ జోడీ ప్రేమలోఉందట. ఇద్దరి మధ్య గోవాలోనే ప్రేమ మొగ్గ తొడిగిందట. దాంతో సెంటిమెంట్గా నిశ్చితార్థం కూడా అక్కడే జరుపుకున్నారు.

పల్లవి వర్మది భీమవరం. తనని పల్లవి ఎంతగానో ప్రేమిస్తుందని, నేనంటే చాలా నమ్మకమని, అందుకే ఫోన్ కూడా చెక్ చేయదని.. చాలా స్వేచ్ఛనిచ్చే అమ్మాయని నిఖిల్ ఇదివరకు పల్లవి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నిశ్చితార్థంలో గోవాలో జరిగినా, పెళ్లి మాత్రం హైదరాబాద్లోనే జరగబోతోందట. నిఖిల్ ఇటీవలే `అర్జున్ సురవరం`తో విజయాన్ని అందుకున్నారు. గీతాఆర్ట్స్లో ఓ సినిమా చేయబోతున్నాడు.