యువ‌నిర్మాత చిల‌క్కొట్టుడు!

కాస్టింగ్‌ కౌచ్.. మీటూ అంటూ బోలెడంత హ‌డావుడి వేడెక్కిస్తోంది. అయితే దీని ప్ర‌భావం టాలీవుడ్ లో ఎంత అంటే చెప్ప‌లేం. అప్పుడప్పుడు మందు పార్టీలు.. సిటీ ఔట్ స్క‌ర్ట్స్ కి ఔటింగులు య‌థావిధిగానే సాగిపోతున్నాయ‌న్న స‌మాచారం ఉంది.

ఈ మ‌ధ్య ఓ యవ నిర్మాత ఓ కొత్త‌మ్మాయితో చెట్టా ప‌ట్టాల్ అంటూ తిరిగేస్తుండ‌డం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది. త‌ర‌చూ ఆ ఇద్ద‌రూ  సీక్రెట్ ప్లేస్ లో సీక్రెట్ గ‌దిలోకి వెళుతున్నార‌ని…  నిర్మాత గ‌దిలోకి వెళ్లి బ‌య‌టికి వ‌స్తున్న కొత్త‌మ్మాయి సిగ్గుల మొగ్గ‌వుతూ బ‌య‌టికి వ‌స్తోంద‌ని స్పాట్ బోయ చెప్ప‌డంతో అస‌లు గుట్టు ర‌ట్ట‌య్యింది. ఇంత‌కీ లోప‌ల ఏం జ‌రుగుతోంది?  యంగ్ నిర్మాత కొత్త హీరోయిన్ తో స్టోరీ డిస్క‌స్ చేస్తున్నాడా? లేక ఇంకేమైనా చేస్తున్నాడా? అన్న‌ది మాత్రం బ‌య‌టి వాళ్ల‌కి అంతుచిక్క‌డం లేదు. ఈ తంతు చూస్తుంటే `అమ్మాయిలే కాస్టింగ్ కౌచ్ కు స‌హ‌క‌రిస్తున్నారు` అని బాహాటంగానే చెప్పిన ఆ పెద్దాయ‌న మాట‌నే న‌మ్మాల్సొస్తోంది. ఈ చాటు మాటు ఎపిసోడ్ లో తారాగ‌ణం ఎవ‌రెవ‌రు? అన్నది మాత్రం గ‌ప్ చుప్.

%MCEPASTEBIN%