ప్ర‌భాస్ పెళ్లి .. ఇదీ కొత్త‌ సంగ‌తి!

Last Updated on by

బాహుబ‌లి ప్ర‌భాస్ పెళ్లెప్పుడు? మ‌గువ‌ల్లో నిరంత‌రం హాట్ డిబేట్ ఇది. ఇదే ప్ర‌శ్న ఇటీవ‌ల కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌ర‌ణ్ జోహార్ ప్ర‌శ్నించారు. అయితే పెళ్లి మాటెత్తితేనే ఏదోలా ఎస్కేప్ అయిపోతున్నాడు. పెద‌నాన్న కృష్ణంరాజు ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే ప‌లు టీవీ చానెళ్ల లైవ్ ల‌లో చెప్పి విసిగిపోయారు. అయినా అభిమానుల్లో ఇంకా ఇంకా అదే ప్ర‌శ్న వినిపిస్తూనే ఉంది. ఇదే ప్ర‌శ్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామ‌లా దేవిని అడిగేస్తే షాకిచ్చే ఆన్స‌ర్ చెప్పారు.

ఓ ఇంట‌ర్వ్యూలో శ్యామ‌లాదేవి ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్న ప్ర‌భాస్ ప్ర‌తిసారీ ఇవి పూర్త‌య్యాక పెళ్లికి ఓకే అంటాడని, అయితే ప్ర‌తిసారీ అది వాయిదా ప‌డుతోంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న రెండు సినిమాలు పూర్త‌య్యాక పెళ్లి గురించి అప్ డేట్ వ‌స్తుంద‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్ర‌భాస్ కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? మా ఇంటికి వ‌చ్చిన ప్ర‌తి అమ్మాయి క‌లిసిపోయే అమ్మాయే కుదిరారు. ప్ర‌భాస్ కి కూడా క‌లిసిపోయే అమ్మాయే రావాల‌ని కోరుకుంటున్నాం అన్నారు. మొత్తానికి ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓ ఇంటివాడ‌య్యేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఇప్ప‌టికీ చేసుకోక‌పోతే బాలీవుడ్ సీనియ‌ర్ బ్యాచిల‌ర్ సల్మాన్ ఖాన్ త‌ర‌హాలోనే సౌత్ లో ఒక‌రున్నారు! అని అభిమానులు ప‌దే ప‌దే చెప్పుకోవాల్సి వ‌స్తుందేమో!! మ‌రోవైపు ప్ర‌భాస్ ఇంకా సింగిల్ గానే ఉండిపోవ‌డంతో కొంత‌మంది అమ్మాయిలు బుగ్గ‌పై ఒక‌టిచ్చి సిగ్గు ప‌డిపోవ‌డం చూస్తూనే ఉన్నాం. గాళ్స్ చీకు చింత‌ల‌న్నిటికీ ఒక‌టే ప‌రిష్కారం.. ద‌టీజ్ డార్లింగ్ మ్యారేజ్ క‌మిట్మెంట్‌.

User Comments