నాని జెర్సీని ఆకాశానికి ఎత్తేసిన యంగ్ టైగ‌ర్

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన `జెర్సీ` నేడు విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది. టాప్ వెబ్ సైట్స్ అన్నీ మంచి రేటింగ్స్ ఇచ్చాయి. విమ‌ర్శ‌కుల‌ను సైతం క‌దిలించిన గొప్ప‌ సినిమాగా ప్ర‌శంస‌లందుకుంటోంది. అటు సినీ ప్ర‌ముఖులు జెర్సీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా రిలీజ్ రోజే జెర్సీ చూసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అయితే సినిమాని, నాని పెర్పామెన్స్ ని, ద‌ర్శ‌కుడి ప‌నిత‌నాన్ని ట్విట‌ర్ వేదిక‌గా ఆకాశానికి ఎత్తేసారు.

`నాని బ్రో నువ్వు కొడితే బంతి స్టేడియం బ‌య‌ట ప‌డింది. బ్రిలియంట్. బ్రిలియంట్, బ్రిలియంట్. పెర్పామెన్స్.. నీ న‌ట‌న భ‌విష్య‌త్ లో కూడా ఇలాగే ఉండాలి. నిన్ను చూస్తుంటే గ‌ర్వంగా ఉందన్నారు. ఇక ద‌ర్శ‌కుడు గౌత‌మ్ గురించి మాట్లాడుతూ, ` ఇలాంటి క‌థ‌ని ఎంచుకుని..అద్భుతంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ కి హ్యాట్సాఫ్. ద‌ర్శ‌కుడు విజ‌న్ కు త‌గ్గ‌ట్టు చిత్రంలో న‌టీన‌టులు,సాంకేతిక నిపుణుల ప‌నితీరు క‌నిపిస్తోందని ప్ర‌శంసించారు. జెర్సీకి మంచి టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో యంగ్ గైట‌ర్ సంచ‌ల‌న ట్వీట్ సినిమాను మ‌రింత పైకి లేపింది. ఈ స‌మ్మ‌ర్ కి మ‌జిలీ బోణీ కొడితే దాన్ని జెర్సీ కొన‌సాగించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. రెండు ఎమోష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కావ‌డం విశేషం.

Also Watch : 47  Days Movie Trailer Launch Event Stills