తార‌క్ బ‌ర్త్‌డే ఫ్యాన్స్ కి నిరాశే

Last Updated on by

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు ఆర్ఆర్ఆర్ టీమ్ అదిరిపోయే ట్రీట్ ఇస్తుంద‌నే భావించారంతా. కానీ అస‌లు ట్రీట్ అన్నదే  లేకుండా ఎన్టీఆర్ నిరాశ‌ప‌రిచారు. ఈసారి బ‌ర్త్ డే జ‌రుపుకునే మూడ్ లేద‌ని ఇదివ‌ర‌కూ ఫ్యాన్స్ కి ఒక లేఖ‌ను కూడా పంపించారు తారక్. తాను ఎంత‌గానో ప్రేమించే తండ్రి గారు హ‌రికృష్ణ మ‌ర‌ణించి ఏడాది కూడా పూర్త‌వ్వ‌లేదు. అందుకే ఈసారి వేడుక‌లు వ‌ద్ద‌ని తార‌క్ అభిమానుల‌కు ముందే పిలుపునిచ్చారు.
అందుకే నేడు స్థ‌బ్ధుగా ఉంది వాతావ‌ర‌ణం. నంద‌మూరి అభిమానుల్లో కోలాహాలం మిస్సయ్యింది. ఇక‌పోతే ఎస్.ఎస్.రాజ‌మౌళి.. డివివి దానయ్య బృందం సైతం అంతే సైలెట్ గా ఉన్నారు. ఏదో సామాజిక మాధ్య‌మాల్లో ఎన్టీఆర్ కి శుభాకాంక్ష‌లు చెప్పారంతే. మొత్తానికి నేడు బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని తార‌క్ – కొమ‌రం భీమ్ కొత్త లుక్ ని రివీల్ చేస్తార‌నుకుంటే నిరాశ‌నే ఎదురైంది. ఇక‌పోతే ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తార‌క్ కి క‌థానాయిక‌ను వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించ‌నున్నారు. ఆస‌క్తిక‌రంగా స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందించి తార‌క్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చిన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా జూలై 30 న రిలీజ‌వుతుంది కాబ‌ట్టి అప్ప‌టికి తార‌క్ కెరీర్ రెండు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకోనుంది.