యంగ్ టైగ‌ర్ సొంత బ్యాన‌ర్ ప్లాన్

Jr. NTR - File Photo

మ‌న స్టార్లు సొంతంగా బ్యాన‌ర్లు పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాము న‌టిస్తూనే ఇత‌ర హీరోల‌తోనూ సినిమాలు తీయ‌డం కొత్త ట్యాలెంటును ప్రోత్స‌హించ‌డం అన్న కొత్త ట్రెండ్ మొద‌లైంది. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు అనే తేడా లేకుండా సొంత నిర్మాణ సంస్థ‌ల‌తో త‌లమున‌క‌లుగా ఉన్నారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మ‌హేష్ వీళ్లంద‌రికీ సొంతంగా బ్యాన‌ర్లు ఉన్నాయి. చ‌ర‌ణ్ స్వ‌యంగా సినిమాలు నిర్మిస్తుంటే.. బ‌న్ని- ప్ర‌భాస్ ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ స్నేహితుల‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తుంటారు.

నేచుర‌ల్ స్టార్ నాని, రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ట్యాలెంటెడ్ నాగ‌శౌర్య ఇప్ప‌టికే సొంతంగా బ్యాన‌ర్లు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు.. న‌టీన‌టుల‌కు అవ‌కాశాలిస్తున్నారు. ఇక వీళ్లంద‌రి బాట‌లోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సొంతంగా బ్యాన‌ర్ ప్రారంభిస్తున్నార‌ట‌. అన్ని కాంపౌండ్ల‌లోనూ బ్యాన‌ర్ల గురించి సంద‌డి ఉంటుంది కానీ తార‌క్ ఇలాంటి సంద‌డి చేయ‌లేదు. అయితే తొంద‌ర్లోనే ఎన్టీఆర్ కూడా సొంతంగా ఓ బ్యాన‌ర్ ప్రారంభించ‌నున్నాడ‌ట‌. అన్న క‌ళ్యాణ్ రామ్ త‌ర‌హాలోనే ఒక సొంత బ్యాన‌ర్ స్థాపించి తాను కూడా సినిమాలు నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అందులో తాను న‌టిస్తూనే.. ఇత‌రుల‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తార‌ట‌. హీరోలంతా ఇలా చేస్తే మంచిదే. ప‌దిమంది ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు ల‌భిస్తాయి. ప‌రిశ్ర‌మ కార్మికుల‌కు ఉపాధి పెరుగుతుంది.