నేడు జ‌గ‌న్‌ అసెంబ్లీకి.. బాబు ఎక్క‌డికి?

Last Updated on by

నేడు సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళుతున్నారు? చెక్ డీటెయిల్స్..

ముఖ్యమంత్రి హోదా లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. నేటి ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లి లోని నివాసం నుండి బ‌య‌ల్దేరారు. ఇప్ప‌టికే సీఎం జగన్ అసెంబ్లీకి చేరుకున్నార‌ని తెలుస్తోంది. జగన్… 11.05 నిముషాలకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 12.గంటలకు తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు.

సేమ్ టైమ్ నేటి ఉద‌యం ఉండవల్లి ప్రజావేదికకు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 10.30 కి ఉండవల్లి నివాసం నుంచి ఎమ్యెల్యే లతో కలిసి అసెంబ్లీ కి మాజీ సీఎం చంద్రబాబు బ‌య‌ల్దేరారు. 10.45 కి వెంకటపాలెం లో ఎన్ఠీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మద్యాహ్నం ఒంటి గంట వరకూ అసెంబ్లీ లో బాబు బృందం ప్ర‌తిప‌క్ష హోదాలో సీఎం జ‌గ‌న్ ని ప‌ల‌క‌రించ‌బోతున్నార‌ట‌.

User Comments