సీఎం అయ్యేవ‌ర‌కూ నిద‌ర‌పోడా?

Last Updated on by

ఒక‌రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా 100రోజులు నిదురే లేకుండా గ‌డిపాడ‌ట‌!! ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో కొద్ది రోజులుగా ప్ర‌చారంలో బిజీగా వున్న ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌చారానికి బ్రేకిచ్చారు. బిజీ షెడ్యూల్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ప్ర‌చారానికి బ్రేకిచ్చారు. ఈ విరామంలో ఎన్నిక‌ల్లో వ్య‌వ‌హ‌రించాల్సిన ప్యూహంపై పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నార‌ట‌. సోమ‌వారం సాయంత్రం ప్ర‌చారం ముగించుకుని హైద‌రాబాద్‌లోని త‌న నివాసం లోట‌స్ పాండ్‌కు చేరుకున్న జ‌గ‌న్ ప్ర‌చార స‌ర‌ళి, ఎన్నిక‌ల ప్యూహంపై చ‌ర్చించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

అనంత‌రం బుధ‌వారం నుంచి మ‌ళ్ళీ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తార‌ట‌. బుధ‌వారం అన‌గా మూడున వైఎస్ జ‌గ‌న్ మూడు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. బుధ‌వారం ఉద‌యం 9గంట‌ల‌కు గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో.. గుర‌జాల‌లో 11:30కు, మ‌ధ్యాహ్నం 1:30కు ప్ర‌కాశం జిల్లా ఒంగోలు, 3:30 గంట‌ల‌కు కృష్ణా జిల్లా మైల‌వ‌రంలో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు. వ‌రుస బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటున్న జ‌గ‌న్ మ‌ధ్య మ‌ధ్య‌లో ఓ రోజు విరామం తీసుకుంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం ప్ర‌చారానికి బ్రేకిచ్చారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం సీఎం సీట్లో కూచోవ‌డ‌మే ధ్యేయంగా గ‌త 100రోజులుగా అలుపెర‌గ‌కుండా జ‌నంలో తిరుగుతున్న జ‌గ‌న్ కి కంటిపై కునుకైనా ప‌డుతుందా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

User Comments