వివేకా హ‌త్య.. ఎవ‌రి మెడ‌కు?

Last Updated on by

ఏపీ ఎన్నిక‌ల ముందు వైయ‌స్ సోద‌రుడు వివేకానంద రెడ్డి హ‌త్య క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య తేదేపా ప‌న్నాగ‌మేన‌ని వైయ‌స్ జ‌గ‌న్ వాదిస్తుంటే, కాదు.. జ‌గ‌న్ ఆడుతున్న నాట‌క‌మిద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు. బాబాయ్ ని హ‌త్య చేయించింది వైయ‌స్ జ‌గ‌న్ అని విమ‌ర్శ‌లు చేయిస్తున్నారు. దీంతో సామాన్య ప్ర‌జ‌ల్లో ఈ హ‌త్యోదంతం విష‌య‌మై క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఈ వింతాట‌కంలో ఎవ‌రు ఈ హ‌త్య చేయించారు? అన్న‌దానిపై నిజాలు నిగ్గు తేల‌లేదింకా. దీనిపై ప్ర‌భుత్వం సిట్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. అయితే ఈలోగానే వైయ‌స్ వివేకానంద‌రెడ్డి కుమార్తె మీడియా ముందుకు వ‌చ్చి తేదేపా క‌నెక్ష‌న్ ఉన్న కొంద‌రిపై అనుమానం ఉంద‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. జ‌గ‌న్ కి కానీ, అత‌డి అనుచ‌రుల‌కు కానీ ఈ హ‌త్య‌తో సంబంధం లేద‌ని వివేకా కుమార్తె నిన్న‌టిరోజున మీడియాకెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే కోర్టు వైపు నుంచి కీల‌క‌మైన ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నందున .. అలాగే సిట్ ద‌ర్యాప్తు సాగుతున్న ఈ త‌రుణంలో ఎవ‌రూ ఈ కేసుపై పెద‌వి విప్ప‌కూడ‌ద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. అటు తేదేపా వాళ్లు కానీ, ఇటు వైకాపా వాళ్లు కానీ దీనిపై అన‌వ‌స‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కూడ‌ద‌ని కండిష‌న్ పెట్టింది హైకోర్టు. ఇకపై హత్యగురించి మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సిట్ విచారణ యధావిధిగా కొనసాగించుకోవచ్చని సూచించింది. సిట్ సైతం కేసు విష‌య‌మై వివ‌రాల్ని బ‌య‌ట పెట్ట‌కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌న్న వాద‌న‌ల్ని హైకోర్టులో జ‌గ‌న్ వ‌ర్గం వినిపించింది. ప్ర‌స్తుతం 15వ తేదీన తుది విచార‌ణ‌కు వాయిదా వేసింది.

Also Read : Much Awaited Update On Bheeshma 

User Comments