షాక్‌: వైయ‌స్ ఆత్మ మ‌ర‌ణం

Last Updated on by

మాజీ ఎంపీ, మాజీ మంత్రివర్యులు వైయస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. వైయ‌స్ ఆత్మ‌గా పాపుల‌రైన ఆయ‌న‌ నేటి తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయ‌న చిన్న తమ్ముడు. 1950 ఆగస్టు 8న పులివెందుల లో జన్మించారు. గతంలో మంత్రిగా ఎంపీగా , ఎమ్మెల్సీ గా ప‌ని చేసిన అనుభ‌వ‌జ్ఞుడు. 1989, 1994 లో రెండుసార్లు పులివెందుల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైయస్ వివేకానంద రెడ్డి…. అన్న‌ వైయ‌స్సార్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు.

2004లో మరోసారి కడప ఎంపీగా ఎన్నికైన వైయస్ వివేకానంద రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహించిన అనుభ‌వ శాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో ఓ వైపు ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న వేళ వివేకా నిష్క్ర‌మ‌ణం వైయ‌స్ జ‌గ‌న్ కి పెద్ద దెబ్బేన‌ని విశ్లేషిస్తున్నారు. త‌న‌కున్న అనుభ‌వంతో ఎన్నో రాజ‌కీయ వ్యూహాల్ని ర‌చించిన మేధావి వివేకా. త‌న‌ని కోల్పోవ‌డం జ‌గ‌న్ కుటుంబానికి తీర‌ని లోటు.

User Comments