వైఎస్ వివేకా మ‌ర‌ణం వెన‌క‌ కుట్ర?

Last Updated on by

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి శుక్ర‌వారం హ‌ఠాత్తుగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మ‌ర‌ణం వెనుక కుట్ర జ‌రిగిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గుండెపోటుతో మ‌ర‌ణించాడ‌ని వార్త‌లు వ‌చ్చినా వాస్త‌వ ప‌రిస్థితి అందుకు భిన్నంగా వుండ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. గుండెపోటు రావ‌డంతో చ‌నిపోయారని ప్ర‌చారం జ‌రిగినా వైఎస్ వివేకానంద‌రెడ్డి త‌ల‌, చేతిపై గాయాల‌తో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి వుండ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇప్ప‌టికే దీనిపై వివేకానంద‌రెడ్డి పీఏ పులివెందుల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా మృత దేహాన్ని ప‌రిశీలించిన పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు ఫైల్ చేశారు. అనంత‌రం వివేకా ఇంటిని డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు నిర్వ‌హించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. వైఎస్ వివేక హ‌త్య‌కు కుట్ర జ‌రిగిందా?. ఆయ‌న‌ను చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వుంది? అనే అనుమానాల్ని వైసీపీ నేత‌లు లేవ‌నెత్తుతున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున గుండెపోటుతో మ‌ర‌ణించార‌న్న వ్య‌క్తి చేతికి, కాలికి గాయాలు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

User Comments