జీ గోల్డెన్ అవార్డ్స్.. స్టార్స్ ధ‌గ‌ధ‌గ‌..

Last Updated on by

సాధార‌ణంగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఏదైనా అవార్డ్ ఫంక్ష‌న్ జ‌రిగితే స్టార్స్ రారు. మ‌రీ పెద్ద ఈవెంట్ అయితే త‌ప్ప అక్క‌డ స్టార్ హీరోలెవ‌రూ క‌నిపించ‌రు. కానీ జీ గోల్డెన్ అవార్డ్స్ కు మాత్రం ఒకే వేదిక‌పై బాల‌య్య‌, చిరంజీవి ద‌ర్శ‌న‌మిచ్చారు. చాలా రోజుల త‌ర్వాత ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ఒకే వేదికను పంచుకున్నారు. హైద‌రాబాద్ లోనే జ‌రిగిన ఈ ఈవెంట్ స్టార్స్ రాక‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోయింది. ముఖ్యంగా హీరోయిన్లు అయితే త‌మ అందాల‌తో పిచ్చెక్కించేసారు. కాజ‌ల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా కావాల్సినంత అందాలు గుమ్మ‌రించారు.

ఇక చిరంజీవి, బాల‌య్య రాక‌తో అక్క‌డి ఈవెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయింది. షూటింగ్ తో బిజీగా ఉండి కూడా అది పూర్తి చేసుకుని ఈవెంట్ కు వ‌చ్చాడు చిరంజీవి. ఈయ‌న న‌టిస్తున్న సైరా షూట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇక బాల‌య్య కూడా మొన్న‌టి వ‌ర‌కు దుబాయ్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని వ‌చ్చాడు. వ‌చ్చీ రాగానే జీ అవార్డ్స్ కు వ‌చ్చాడు. శాత‌క‌ర్ణికి ఈయ‌నకు అవార్డు కూడా వ‌చ్చింది. వీళ్ళ‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నాగ‌చైత‌న్య‌.. సందీప్ రెడ్డి వంగా.. శేఖ‌ర్ క‌మ్ముల లాంటి వాళ్లు కూడా ఈ వేడుక‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మొత్తానికి స్టార్స్ రాక‌తో జీ గోల్డెన్ అవార్డ్స్ వేదిక అంతా క‌ళ‌క‌ళలాడి పోయింది.

User Comments